Sunday, March 7, 2010

http://www.weblinkindia.net/ ట్యాబు మేను

http://www.weblinkindia.net/

జావాస్క్రిప్ట్ అచ్తివె మేను

http://www.caodesigns.com/blog/code-examples/active-menu/about-me.htm

Preloader

onClipEvent (enterFrame) {
loading = _parent.getBytesLoaded();
total = _parent.getBytesTotal();
if (percent == undefined) percent = 0;
percent -= (percent-((loading/total)*100))*.25;
per = int(percent);
percentage = per+"%";
loadBar._width = per;
if (percent>99) {
_parent.gotoAndStop(2);
}
}

fullscreen

http://www.broculos.net/tutorials/how_to_make_a_flash_animation_truly_fullscreen/20080314/en

http://www.caodesigns.com/blog/code-examples/active-menu/index.htm

http://www.caodesigns.com/blog/code-examples/active-menu/index.htm

Tuesday, December 8, 2009

రోశయ్య దురదృష్టం

www.ads4sms.comముఖ్యమంత్రి కె. రోశయ్యకు కాలం కలిసి వస్తున్నట్లు లేదు. కాంగ్రెసు అధిష్టానం ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రోశయ్యకు పరిస్థితులు కుదురుకోకుండా చేస్తున్నాయి. ఒక దాని వెంట ఒకటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. పూర్తిగా అధిష్టానం మీద వాలిపోయి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శిబిరం పెట్టిన మంటనుంచి బయట పడ్డారో లేదో ఆయనను తెలంగాణ ఉద్యమం చుట్టు ముట్టింది. వైయస్ జగన్ శిబిరం నుంచి బయటపడడానికి కాంగ్రెసు అధిష్టానం సర్వ శక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఎట్టకేలకు వైయస్ జగన్ ను దారికి తెచ్చి రోశయ్య పీఠాన్ని పదిలం చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఆయన సీటు కిందికి నీళ్లు తెచ్చే పరిస్థితిని తెచ్చి పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది మొదలు ఈ నెల 20వ తేదీ నుంచి ఆయనను తెలంగాణ అంశం నిద్ర పట్టనీయడం లేదు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే రాష్ట్రంలో తీవ్ర వరదలు వచ్చి రోశయ్యను ఆదుకున్నాయో, ఆయనకు నిద్ర పట్టకుండా చేశాయో తెలియదు. వరదలను సాకుగా చేసుకుని ఆయన కొంత కాలం నెట్టుకొచ్చారు. కాంగ్రెసు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు దిగి వచ్చి ఆయనకు అండగా నిలిచారు. రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాలను సందర్శించి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా వారిద్దరే ముందు పడాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణ ఉద్యమం మునుపెన్నడూ లేనంతగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. జగన్ వర్గానికి చెందిన మంత్రులు ఇప్పటికీ ఆయనకు సరిగా సహకరించడం లేదు. దీనికితోడు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు ఇరకాటంలో పడిపోయారు. ఈ స్థితిలో రోశయ్యపై వారు ఒత్తిడి పెంచుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ వ్యూహానికి ప్రతివ్యూహం పన్నుతూ నెట్టుకుని రావడమే కాకుండా తెలంగాణ సెంటిమెంటును చల్లార్చామనే అభిప్రాయం కలిగించారు. రోశయ్యకు ఆ ప్రతి వ్యూహరచన చేసి అమలు చేసే శక్తి లేదనే అభిప్రాయం బలం పుంజుకుంటోంది. రోశయ్య బలహీనమైన ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కూడా బలం పుంజుకుంటోంది. ఏమైనా పదవిని పూర్తి స్థాయిలో అనుభవించడానికి ఆయనకు వీలు చిక్కడం లేదు. ఏమైనా రోశయ్య దురదృష్టవంతడనే చెప్పాలి.www.ads4sms.com